Friday, November 22, 2024

చదువుతోపాటు సామాజిక సేవల పై అవగాహన పెంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: చదువుతోపాటు సామాజిక సేవల పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,విద్యార్థులకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతిలో పదికి పది జీపీఏ మార్కులు సాధించిన 39 మంది విద్యార్థులను (ఇందులో 17 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 22 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉన్నారు) జిల్లా కలెక్టర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అభినందిస్తూ మెమొంటోలు, సర్టిఫికెట్లు బహుకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,పదవ తరగతి పరీక్షలో పదికి పది జిపిఏ సాధించిన విద్యార్థులలో 32 మంది బాలికలు ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.విద్యార్థులు చదువులో ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని,వాటిని సాధించేలా శ్రమించాలని,లక్ష్యసాధనలో అలసత్వం,అశ్రద్ధ విడనాడి, చదువుతోపాటు క్రీడలు,సామాజిక సేవల పట్ల స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని అన్నారు.

స్టూడెంట్ రెడ్ క్రాస్,యూత్ రెడ్ క్రాస్ విభాగాల కార్యక్రమాలలో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి,జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, వైస్ చైర్మన్ బాలాజీ, డైరెక్టర్లు అంజయ్య, హమీద్, రాంబాయి, శ్రీనివాస రెడ్డి, యూత్ రెడ్ క్రాస్ సభ్యులు మశ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News