Monday, January 20, 2025

యాదవులతో పాటు మిగతా బీసీ కులాలను బీసీ బంధులో చేర్చాలి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లక్ష రూపాయల సబ్సిడీ రుణ (బీసీ బంధు) పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా యాదవులతో పాటు మిగతా బీసీ కులాలకూ వర్తింపజేయాలని యాదవ సంఘం రాష్ట్ర నాయకులు వుష్కెల పాండుయాదవ్, గ్రేటర్ హైద రాబాద్ యాదవ సంఘం చైర్మెన్ చిట్టబోయిన నందకిశోర్ యాదవ్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర పశు సంవర్దక శాఖా మ ంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకుని, సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి, యాదవులతో పాటు ఇతర బీ సీ కులాలకు లక్ష రూపాయల సబ్సిడీ రుణ పథకం (బీసీ బంధు)లో వర్తింపజేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు గురువారం జాంబాగ్ యాదవ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు యాదవ సంఘం ట్రస్ట్ సభ్యులు భూపాల్ యాదవ్, రామారావు యాదవ్‌లతో కలిసి మాట్లాడారు. దళిత బంధు పేరిట దళితులకు రూ.10 లక్షల సబ్సిడీ రుణం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, బీసీ బంధు పథకం ద్వారా బీసీ కులాలకు కేవలం లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూడటం అన్యాయమన్నారు.

ఇచ్చే లక్ష సబ్సిడీ రుణం కూడా అరకొర కులాలకు మాత్ర మే పరిమితం చేయడం శోచనీయమన్నారు. సమాజంలో సంపదను సృష్టించే యాదవ, కురుమ కులాలతో పాటు ఇతర బీసీ కులాలకు నిర్లక్షం చే యడం ప్రభుత్వానికి తగదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం జంట నగ్లరాల్లోని లక్షలాది యాదవులకు లక్ష రూపాయల సబ్సిడీ రుణం పొందే అవకాశం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రె పిల్లల పంపిణీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం యాదవుల నుండి డబ్బులు వసూలు చేసి నెలలు గడుస్తున్నా నేటికీ గొర్రె పిల్లలను పంపిణీ చేయలేదని ఆరోపించారు. చాకలి, మంగలి కులస్తులకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్న ప్రభు త్వం యాదవుల డైరీ ఫామ్‌లకు కమర్షియల్ విద్యుత్ చార్జీలు వ సూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వందల ఎకరాలున్న ధనికులకు రైతు బ ంధు పథకం వర్తింపజేస్తున్న ప్రభుత్వానికి బీసీ కులాల్లో ఉన్న పేదలు కనిపించడం లేదా ? అని ప్రశ్నించారు. బీసీ=డిలో ఉన్న యాదవులు అన్ని ర ంగాల్లో వెనుకబడి పోయారని, రిజర్వేషన్‌లు లేక ఉద్యోగావకాశాలు లేక దిక్కుతోచని స్థితిలో దుర్బర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పశువుల పోషణార్దం యాదవులకు నగర శివార్లలో లీజు పద్దతిన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, యాదవులు అభ్యున్నతికి చేయూత అంది ంచాలని వారు సిఎం కెసిఆర్‌కు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు.

బీసీ బంధు పథకాన్ని యాదవులతో సహా మిగతా బీసీ కులాలకు వర్తింపజేసే విషయమై 10 రోజుల్లోగా సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యాదవ సంఘాన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గోపాల్ యాదవ్, పి అనిల్ యాదవ్, ఎస్ శ్రీనివాస్‌యాదవ్, పి రమేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, సత్యం యాదవ్, పి రాజు యాదవ్, మురథి యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News