Monday, December 23, 2024

సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ సీజ్..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పరిశుభ్రత పాటించకుండా ఓ యువకుడు అనారోగ్యం బారిన పడేందుకు కారణమైన సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌ను జిహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 15వ తేదీన ఓ యువకుడు ఆల్ఫా హోటల్‌లో మటన్ కీమా, రోటీ తిన్నాడు. తని ఇంటికి వెళ్లిన తర్వాత యువకుడు అనారోగ్యం బారిన పడ్డాడు. వెంటనే కుంటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ఫుడ్ వల్లే జరిగిందని వైద్యులు తెలిపారు. ఈ విషయం మీడియాలో రావడంతో జిహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు 15వ తేదీన హోటల్‌లోని ఫుడ్ శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని ల్యాబ్‌కు పంపించారు. హోటల్‌లోని కిచెన్, పరిసరాలను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం సందర్శించారు. అక్కడ కిచెన్‌లో ఏ మాత్రం హైజీన్ మేయిన్‌టేయిన్ చేయడం లేదని గ్రహించి వెంటనే ఆల్ఫా హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News