పారిశ్రామిక వేత్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం
వారిపై ఎలాంటి వేధింపులు
లేవు.. దాడులు లేవు
పెట్టుబడిగా పెట్టే ప్రతి
రూపాయికి భద్రత ఔత్సాహిక
పారిశ్రామిక వేత్తలకు
మరింత ప్రొత్సాహం అల్‌ప్లా
మౌల్డ్ షాప్ ఎడ్యుకేషన్ సెంటర్
ప్రారంభోత్సవంలో ఐటి,
పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్/పటాన్‌చెరు : పారిశ్రామిక వేత్తలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్సేనని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్చ కల్పిస్తోందన్నారు. పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో ఎలాంటి వేధింపులు లేవు.. లేవన్నారు. వారు పెట్టుబడిగా పెడుతున్న ప్రతి రూపాయికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందన్నారు. దీని కారణంగానే అనతి కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల ఖిల్లాగా మారిందన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో సుమారు రూ. 60 కోట్లతో ఏర్పాటుచేసిన అల్‌ప్లా మౌల్డ్ షాప్, ఎడ్యుకేషన్ సెంటర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రా ష్ట్రంలోని పారిశ్రామికవేత్తలపై, పెట్టుబడిదారులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు.
అందువల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితి దేశంలో మరెక్కడా లేదన్నారు. కాలుష్య ర హిత పరిశ్రమలను ప్రోత్సహిస్తూ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. లో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పె ట్టాలంటే ప్రభుత్వాలు…మంత్రులు చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వచ్చేదని కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రం లో లేదన్నారు. ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా దేశంలోనే అత్యున్నతమైన టిఎస్…ఐపాస్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నా రు. దీని కింది కేవలం పదిహేను రోజుల్లోనే సదరు వ్యాపారవేత్తలకు కావాల్సిన అన్ని రకాల అనుమతులను జారీ చేస్తున్నామన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను మరింతగా ప్రొత్సహిస్తున్నామన్నారు. దీంతో పారిశ్రామిక రంగంలో రాష్ట్రం పరుగులు తీ స్తోందన్నారు. త్వరలోనే జిన్నారం మండలంలో ఎల్‌ఇడి బల్బుల పరిశ్రమ ఏర్పాటు కాబోతోందన్నారు.
ఇఒడి ద్వారా పరిశ్రమలను ప్రొత్సహిస్తున్నాం
ఈజ్ ఆఫ్ డూయింగ్ (ఇఒడి)ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో స్థిరమైన, సామర్థ్యం ఉన్న ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోందన్నారు. ఫలితంగా జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని కేవలం ఏ ఒక్క జిల్లాకో పరిమితం చేయకుండా….రాష్ట్రమంతటా సమ్మిళిత అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి వస్తున్న దిగుమతులు తగ్గించి స్థానికంగానే ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. తద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్నామన్నారు.
ఐదు విప్లవాలను సాధించాం
టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఐదు విప్లవాలు వచ్చాయని కెటిఆర్ అన్నారు. ఇందులో ప్రధానమైనది సస్య విప్లవమన్నారు. దీంతో లక్షల ఎకరాల సాగులోకి తీసుకొచ్చామన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. నీలి విప్లవంతో మన దేశ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో చేపల ఉత్పత్తి చేరిందని కెటిఆర్ తెలిపారు. క్షీర విప్లవంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులతో మూతపడే దశలో ఉన్న విజయా డైరీ నేడు ప్రభుత్వానికి డివిడెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగిందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో గులాబీ విప్లవంతో మాంసం ఉత్పత్తి కూడా పెరిగిందన్నారు.
పసుపు విప్లవంతో రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తి పెరగనుందన్నారు. వచ్చే ఐదేండ్లలో 25లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. అలాగే 10వేల ఎకరాల్లో అగ్రో ఆధారిత ఫుడ్ ఆహార శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు మహిపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.