Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బిజెపియే : మురళీధర్‌రావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో యువత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని బిజెపి మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్ మురళీధర్ రావు అన్నారు. శనివారం బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి యువత మీద దృష్టి పెట్టాలన్నారు. యువకులే కెసిఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తారన్నారు. కెసిఆర్ వైఫల్యాల పైన దృష్టి పెడితే ఆయనను ఓడించడం ఈజీ అని చెప్పారు. ఇప్పటికే బిజెపి డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్యపై పోరాటం చేస్తోందన్నారు. మోడీ వ్యతిరేకులైన ఓ వర్గం మీడియా తెలంగాణలో కాంగ్రెస్‌ను బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చూపించే ప్రయత్నం చేస్తోందని అయితే అది సాధ్యం కాదన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం అనుకొని ప్రజలు ఓటు వేశారని, కానీ కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు బిఆర్‌ఎస్‌లో చేరారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది బిఆర్‌ఎస్‌కు వేసినట్టేనన్నారు. అందుకే బిఆర్‌ఎస్‌కు బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చుకొని ఆయా రాష్ట్రాలకు వెళ్ళి కెసిఆర్ షో చేసిండని, కర్నాటకకు పోకుండా కెసిఆర్ మహారాష్ట్రకు ఎందుకు పోతున్నడని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు యువత పూర్తి వ్యతిరేకంగా ఉంది. అదే రాబోయే ఎన్నికల్లో గేమ్ చెంజర్‌గా మారుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News