Thursday, January 23, 2025

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఇబ్రహింపట్నం ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బుర్ర రేఖమహేందర్‌గౌడ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్ పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మరో రెండు నెలలో మరింతగా అభివృద్ధిపథంలో దూసుకెళ్తామని తెలిపారు. రూ.3 కోట్లు త్వరలోనే మంజూరు చేసి పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇప్పటికే మండల వ్యాప్తంగా ఉన్న గ్రామీణా రోడ్డు అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. ప్రమాదకరంగా మారిన లష్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణం పనులకు నిధుల కేటాయించామని, కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బండరావిరాలలో రైతులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నామని త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేస్తున్న ప్రజాప్రతినిధుల, అధికార్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సమావేశంలో జెడ్పిటిసి బింగి దాస్‌గౌడ్, ఆర్‌డివో వెంకటాచారీ, వైస్ ఎంపిపి కొలన్ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ అనితారెడ్డి, ఎంపిడివో మమత బాయ్, సర్పంచ్‌లు చెరుకు కిరణ్‌కుమార్, కరిమెల వెంకటేష్, పోచంపల్లి సుధాకర్‌రెడ్డి, కవాడి శ్రీనివాస్‌రెడ్డి, బుర్ర వీరస్వామిగౌడ్, జక్క లావణ్యపాపిరెడ్డి, ముద్దం స్వరూపవీరస్వామి, సురకంటి వనజశ్రీనివాస్‌రెడ్డి, అంతటి యాశోఊషయ్యగౌడ్, ఎంపిటిసిలు సీక సాయికుమార్‌గౌడ్, కేశెట్టి వెంకటేష్, భీమాగౌని భాస్కర్‌గౌడ్, చేగూరి వెంకటేష్, గ్యార బాల లింగస్వామి, దంతూరి అనితమహేందర్‌గౌడ్, రాచపాక లావణ్యయాదగిరి, మండల కో-ఆప్షన్ సభ్యులు ఎండి గౌస్ పాషా, వివిధ శాఖల అధికార్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News