హైదరాబాద్: విద్యుత్ ప్రమాణాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు సూచించిన నాణ్యమైన పరికరాలను వినియోగించాలని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బెగంపేటలోని హోటల్ ది ప్లాజాలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్ పీడీసీఎల్) కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన కేతం టెక్నికల్ సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన గెల్లు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కోతలకు చోటు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేలా సీఎం కేసీఆర్ మారదృష్టితో ప్రణాళికలు రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారని అన్నారు.
పట్టణాల్లోనే కాదు మారు మూల గ్రామాల్లో సైతం విద్యుత్ కోతలు లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే అన్నారు. ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాల నివారణలో నిరంతరం అప్రమత్తతో పాటు నాణ్యమైన పరికరాలను వినియోగించాలన్నారు.విద్యుత్ శాఖ అధికారులు చేసే సూచనలు క్షేత్ర స్థాయిలో అందరు పాటిస్తే, విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉండదన్నారు.తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రధాన విద్యుత్ తనిఖీ అధికారి ఎస్.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో విద్యుత్ వైర్లు, ఇతర పరికరాలు ఎంతో నాణ్యత కలిగినవై ఉండాలని, ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్స్ ప్రకారమే తయారైన వాటినే ఎలక్ట్రికల్ నిపుణులు వినియోగించాలన్నారు.ఇళ్లు, పరిశ్రమలు, మరెక్కడైనా విద్యుత్ను వినియోగిస్తున్నప్పుడు నిపుణులతో విద్యుత్ సరఫరా ఎలా ఉంది..? పూర్తిగా ఆగిపోతుందా? లేదా వంటి విషయాలను తరచూ తనిఖీ చేసుకోవాలని సూచించారు.
టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిజిఎం చక్రపాణి మాట్లాడుతూ భవనాలకు విద్యుత్ భద్రత తప్పనిసరిగా ఉండాలని, ఐఎస్‌ఐ మార్కు ఉన్న విద్యుత్ పరికరాలను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లైసెన్సింగ్ బోర్డ్ కార్యదర్శి ఈ కాంతారావు.తెలంగాణ లైసెన్సింగ్ బోర్డ్ నెంబర్. పి స్వామి గౌడ్ కార్యక్రమంలో టీఎస్‌ఎస్ పీడీసీఎల్ కాంట్రాక్టర్స్ ఆసోసియేషన్ అధ్యక్షులు పి.భాస్కర్, తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మాజీ సభ్యులు నక్క యాదగిరి, ఆసోసియేషన్ ప్రతినిధులు మైపాల్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ రాజు, రంజిత్ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.