Saturday, December 21, 2024

పేద విద్యార్థులకు ఎల్లవేళలా సహకారం

- Advertisement -
- Advertisement -

మౌలాలి : అన్ని దానాలలో కెల్లా విద్యాదానం చా లా గొప్పదని, పేద విద్యార్ధులకు ఎల్ల వేళలా తన వంతు సహాయ స హాకారం అందచేస్తానని వినాయక్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ క్యా నం రాజ్యలక్ష్మీ అన్నారు. శనివారం కాకతీయనగర్‌కు చెందిన శివరామ ప్రసాద్ సహకారంతో రామకృష్ణాపురంలోని సంచార జాతుల కు చెందిన మూగ పిల్లలకు ఆమె షూస్ ( బూట్లు)పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… బాల్యం ప్రతి ఒక్కరికి మధురమైనదని, చిన్న నాటే మంచి విద్యాబద్దులు అందిస్తే భవిష్యత్తులో అన్ని రంగాల్లో వారు రాణిస్తారన్నారు.

నేరేడ్‌మెట్ జిల్లా పరిషత్తు పాఠశాలలో చదువుకుంటున్న ఈ చిన్నారులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పేదలను ఆదుకోవడమే మానవత్వమన్నారు. తన చేతుల మీదుగా ఈ చిన్నారులందరికి అవసరమైన బూట్లు పంపిణీ చేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నా రు. చిన్న నాటి నుంచి విద్యార్ధులకు మంచి విద్యనందిస్తే వారు స మాజంలో ఉత్తమ పౌరులుగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహాం నిర్వాహకులు మహేష్, రవీంద్రనా థ్, కేదార్ శంకర్, కృష్ణంరాజు, బిజెపి వినాయక్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News