- Advertisement -
మహిళల టి20 ప్రపంచకప్ వేదికను బంగ్లాదేశ్ నుంచి వేరే దేశానికి మార్చడమే మంచిదని ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ అలీసా హీలీ అభిప్రాయపడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కష్టాల్లో ఉందని, ఇలాంటి స్థితిలో ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం వారికి చాలా కష్టంతో కూడుకున్న అంశమని పేర్కొంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని వేదికను వేరే దేశానికి మార్చితేనే బాగుంటుందని తెలిపింది. యుఎఇ, శ్రీలంక, భారత్ తదితర దేశాల్లో ఎక్కడ నిర్వహించినా ఎవరికీ అభ్యంతరం ఉండదని వివరించింది. అంతర్గత వ్యవహారాలతో ఇబ్బందుల్లో ఉన్న బంగ్లాదేశ్‌లో వరల్డకప్ టోర్నీ నిర్వహిస్తే భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హీలీ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హీలీ సూచించింది.
- Advertisement -