- Advertisement -
యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్ పరిశోధన
లండన్ : అల్జిమర్స్ వ్యాధి, తీవ్ర కొవిడ్ ఇన్‌ఫెక్షన్లపై ప్రభావం చూపించే ఒక జన్యువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రెండు వ్యాధుల వైద్య చికిత్స కోసం అవసరమైన ఔషధాన్ని అభివృద్ధి చేసే లక్షాలను సాధించడానికి దీనివల్ల మార్గం ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పరిశోధకులు ఒఎఎస్ 1 జన్యువు తాలూకు జన్యు వేరియంట్ మొత్తం జనాభాలో 3 నుంచి 6 వాతం వరకు అల్జిమర్స్ వ్యాధిని అధికంగా పెంచుతుందని, అదే జన్యు సంబంధిత వేరియంట్లు తీవ్ర కొవిడ్ పరిస్థితి పెరగడానికి దోహదం చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన సంబంధిత ఇతర ఇన్‌ఫెక్షన్లకు, డెమెన్షియాకు తగిన వైద్య చికిత్సతోపాటు ఔషధాల తయారీకి వీలు కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు. యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ లండన్ పరిశోధకులు చేపట్టిన ఈ పరిశోధన వివరాలు జర్నల్ బ్రెయిన్‌లో వెల్లడయ్యాయి.
- Advertisement -