తిరువనంతపురం: నటి అమలా పాల్ తెలుగు,తమిళ్, మలయాళం సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి. ఇటీవల ఆమెను కేరళలోని తిరువైరణికులం మహాదేవ మందిరంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. పుట్టుకతో ఆర్థడాక్స్ క్రిస్టియన్ అయినందున ఆమె ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఆమె కేరళలోని ఎర్నాకుళంలో ఉన్న అలువకు చెందింది. మందిర నియమానుసారం గుడిలోకి కేవలం హిందువులకు మాత్రమే అనుమతి ఉందని, ఆమె మహాదేవ మందిరంలోకి ప్రవేశించడానికి వీలులేదని మందిరం అధికారులు తెలిపారు. అయితే ఆమె గుడి బయటి నుంచే దేవతను దర్శించుకోవచ్చని సూచించారు. దీనికి నిరాశ, మనస్థాపానికి గురైన అమలా పాల్ ఆ మందిరం నుంచి వెళ్లిపోయారు. పోతూపోతూ ఆమె మందిరం విజటర్స్ రిజిష్టర్‌లో తన అభిప్రాయాలు రాసి పోయారు. 2023లో కూడా ఇంకా మత ఆచారాల దృష్ట్యా మందిర ప్రవేశంలో వివక్ష కొనసాగుతోందన్నారు. మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అందరినీ ఒక్కలా చూసే రోజు తప్పక వస్తుంది అన్న అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది.
గుడిలోకి నటి అమలా పాల్ ప్రవేశం నిరాకరణ!
- Advertisement -
- Advertisement -
- Advertisement -