Friday, December 27, 2024

లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇడి అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. మద్యం వ్యాపారవేత్త, బ్రిండ్ కో సేల్స్ డైరెక్టర్ అమన్ దీప్ ధాల్-ను ఇడి అదుపులోకి తీసుకుంది. నిందితుడు క్రెడిట్ నోట్, పాలసీ ఫార్ములేషన్-లో భాగస్వామి అయినట్లు ఇడి గుర్తించింది. సాక్ష్యాధారాల ఆధారంగా అమన్ దీప్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది.

అమన్ ధీప్ ను రౌస్ ఎవిన్యూ కోర్టులో అధికారులు ప్రవేశపెట్టారు. అతడికి సౌత్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. విచారణ కోసం అమన్ ధీప్‌ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఇడి అధికారులు కోరారు. లిక్కర్ స్కామ్-లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాతో సహా మొత్తం 15 మంది నిందితులపై సిబిఐ కేసు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News