1.మర్ నే పర్ రోనే వాలే తో
బహుత్ హై మేరె పాస్
తలాష్ తో ఉస్ కీ హై
జో మేరె రోనే పర్ మర్ నే కి బాత్ కరే
మరణించినప్పుడు ఏడ్చేవాళ్ళు
ఎందరో ఉన్నారు నా వద్ద
నేను దుఃఖించినందుకు మరణించే
వాళ్ళ కోసమే నా అన్వేషణ
2.సోజాయియే
సబ్ తక్లిఫోంకో
సిర్హానే రఖ్ కర్ క్యోంకి
సుబః ఉట్ తే హీ ఇన్ హే
ఫిర్ సే గలే లగానా హై
అన్ని కష్టాలను తలగడగా
పెట్టుకుని నిద్రపోండి
ఎందుకంటే ఉదయం లేస్తూనే
అవే కష్టాలను కౌగిలించుకోవాలి కదా
3. ఏ దోస్తీ కా గణిత్ హై సాహెబ్
యహా దొ మే సే ఏక్ గయా తో
కుచ్ నహీ బచ్ తా
ఇది స్నేహానికి సంబంధించిన లెక్క
ఇక్కడ రెండులో నుండి ఒకటి తీసేస్తే
ఏమీ మిగలదిక
4. యు హీ నహి హోతీ
హర జనాజే మే భీడ్, సాహెబ్
హర్ ఇన్సాన్ అచ్చా లగ్ త హై
జానే కే బాద్
అంతిమ యాత్రలో ఇంత రద్దీ
ఎందుకు ఉంటుందని అనుకుంటారు
పోయిన తర్వాత ప్రతి మనిషి
మంచివాడిలాగే అనిపిస్తాడు కదా
బొమ్మలు: దేవులపల్లి శృతి
అనువాదం: దేవులపల్లి అమర్