Monday, December 23, 2024

అమరరాజా రూ.9500 కోట్ల పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రభుత్వం ఇస్తు న్న రాయితీలు, ప్రోత్సాహంతో పెట్టుబడిదారు లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తరలివస్తున్నారు. ఇప్పటివకే వేల పరిశ్రమలు రా ష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు యువత కు ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కంపెనీ రూ.9,500 కోట్ల పెట్టుబడులతో కంపెనీని నెలకొల్పడానికి ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీ తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి అమరరాజా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఐటి, పరిశ్రమల మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టను న్న ఈ సంస్థకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అమరరాజా కంపెనీకి అ న్నివిధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చిన జయదేవ్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇ ది అని, సుమారు రూ.9,500 కోట్లు పెట్టుబడు లు రావడం గొప్ప విషయమని మంత్రి తెలిపా రు. ఇక్కడ మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ శుక్రవారం అవగాహన ఒప్పం దం కుదుర్చుకుందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమరరాజా సంస్థ ముందుకొచ్చింది. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో 9వేల 500 కోట్లు పెట్టుబడి పెట్టడంతో పాటు 4,500 మం ది ఉపాధి కల్పించనున్నట్లు అమరరాజా గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్‌తో పాటు లిథియం అయాన్ గిగా ఫ్యా క్టరీ నెలకొల్పనున్నట్లు వెల్లడించింది.

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని అమరరాజా సంస్థ చైర్మన్, ఎండి గల్లా జయదేవ్ పేర్కొన్నారు. నూతన సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే 10 ఏళ్లల్లో తెలంగాణలోరూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలోనూ తమ సంస్థను ఏర్పాటు చేస్తుండడం సంతోషంగా ఉందని జయదేవ్ పేర్కొన్నారు. 37 ఏళ్లుగా అమరరాజా సేవలందిస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అమరరాజా సంస్థను తెలంగాణ ప్రభుత్వం గతంలో కోరిందని, ప్రస్తుతం ఇప్పుడు కుదిరిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తమ సంస్థ పెట్టుబడులన్నీ ఎపికే పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. పలు కారణాల వల్ల తెలంగాణలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు మొదలుపెట్టలేకపోయామని ఆయన వెల్లడించారు.

విధానపరమైన అంశాలపై విస్తృతంగా విశ్లేషించాం: గల్లా

భారత్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లిథియం అయాన్ బ్యాటరీల తయారీపై గత కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు సరైన ప్రాంతం కోసం చూశామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలపై విస్తృతంగా విశ్లేషించామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని జయదేవ్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ న్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టి ఫైబర్ ఎండి, సీఈఓ సుజయ్, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News