Saturday, November 16, 2024

జూన్ 30 నుంచి మొదలు కానున్న అమర్‌నాథ్ యాత్ర

- Advertisement -
- Advertisement -
Amarnath Yatra
రెండేళ్ల తర్వాత భక్తులకు అవకాశం

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్ర రెండేళ్ల తర్వాత జూన్ 30 నుంచి తిరిగా ప్రారంభం కాబోతున్నది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం అమర్‌నాథ్ క్షేత్ర బోర్డు మీటింగ్‌కు అధ్యక్షత వహించారు. 43 రోజుల పవిత్ర తీర్థయాత్ర జూన్ 30 నుంచి ఆరంభం కానున్నదని ఆయన ప్రకటించారు. ఈ యాత్ర సందర్భంగా కొవిడ్‌కు సంబంధించిన అన్ని ప్రొటోకాల్‌లను దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. పరంపరంగా వస్తున్న ఆచారం ప్రకారం రక్షాబంధన్ రోజున ఈ తీర్థయాత్ర సమాప్తమవుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తీర్థయాత్రకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి.
కరోనా మహమ్మారి భయం కారణంగా గత రెండేళ్లుగా అమర్‌నాథ్ క్షేత్ర బోర్డు ఈ తీర్థయాత్రను రద్దుచేసింది. అయితే పవిత్ర గుహలో వైదిక మంత్రోచ్చరణలతో బాబా అమర్‌నాథ్ పూజలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ భక్తులకు తీర్థయాత్రను మాత్రం గత రెండేళ్ళుగా ఆపేశారు. కరోనా మొదలుకాగానే అమర్‌నాథ్ యాత్రతో పాటు మచైల్ మాతా యాత్రను కూడా రద్దు చేశారు. అప్పుడు కేవలం ప్రతీకాత్మక రూపంలో యజ్ఞం, ‘ఛడీ ముబారక్’లకు మాత్రం అనుమతించారు. జమ్మూకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కిష్త్‌వాడ్ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ శర్మ మచైల్ యాత్ర రద్దు ప్రకటన చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News