Wednesday, December 25, 2024

అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల కేసులో సిఐడి సరికొత్త ఆధారాలు బయటకు తీసుకొచ్చింది. రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందని ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పొంగూరు నారాయణల మీద అభియోగాలు వచ్చాయి. ఈ కేసు విచారణ జరగకుండా మార్చి 19న హైకోర్టు స్టే విధించింది. కేసును కొట్టేయాలంటూ నారాయణ సైతం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ తరువాత అక్టోబర్ 16కు తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలోనే మళ్లీ రీ ఓపెన్ చేయాలని సిఐడి తాజా పిటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News