Tuesday, November 5, 2024

అమరావతే అతి పెద్ద స్కామ్: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పని చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టిడిపి, పవన్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపుల నిలబడుతున్నాయని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏజెంట్‌లా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సిఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా జగన్ పాలన ఉందన్నారు. మ్యానిఫెస్టోలో 98.2 శాతం హామీలు అమలు చేసి చూపించారని ప్రశంసించారు. చంద్రబాబు పాలనలో దేశంలోనే అతి పెద్ద స్కామ్ అమరావతి అని దుయ్యబట్టారు.

అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసమని, ప్రభుత్వానికి ఇస్తే చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేసి ఉండాలన్నారు. లేదంటే చంద్రబాబు ప్రతిపక్ష నేత నివాసంగానైనా మార్చుకోవాలని సజ్జల సూచించారు. చంద్రబాబు కరకట్ట నివాసాన్ని అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందాలు కూడా లేవని, ప్రభుత్వం నుంచి బాబు ఇంటి అలవెన్స్ పొందుతున్నారని, అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారని అడిగారు.

లింగమనేని తనకు ఉచితంగా ఎందుకు ఇచ్చారో చంద్రబాబే చెప్పాలని నిలదీశారు. లింగమనేని రమేష్‌కు, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయని సజ్జల ఆరోపణలు చేశారు. బాబు బరితెగింపునకు నిదర్శనం ఈ అక్రమ నివాసం అని, అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, సంపన్నుల కోసం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేశారని, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News