- Advertisement -
న్యూఢిల్లీ: అమరావతి రాజధాని కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యుయు.లలిత్ వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంశంపై గతంలోనే తన అభిప్రాయాన్ని ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా కేసు విచార నుంచి కూడా తప్పుకుంటున్నట్లు సిజెఐ యుయు. లలిత్ తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తెలిసిన విషయమే. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపి ప్రభుత్వం తన పిటిషన్‌లో డిమాండ్ చేసింది.
- Advertisement -