Monday, December 23, 2024

అమరావతికి రైల్వేలైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బీహార్, ఆంధ్రపదేశ్, తెలంగాణ మీదు గా వెళ్లే రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి కొ త్త రైల్వేలైన్‌ను మంజూరు చేసింది. రూ.2,245 కో ట్లతో హైదరా బాద్, కోల్‌కత్తా, చెన్నైనగరాలను అమరావతికి కలు పుతూ కొత్త రైల్వేలైన్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రా జెక్టులో భాగంగా కృష్ణానదిపై 3.2 కి.మీ రైల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించింది. నాలుగేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుంది. బీహార్, ఆంధ్రపదేశ్, తెలంగాణలకు మరింతగా రైల్వే సేవల విస్తరణకు రూ 6798 కోట్ల వ్యయ అంచనా ల ఈ రెండు ప్రాజెక్టులను ఆమోదించినట్లు కేబినెట్ భేటీ తరువాత అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పు డు ఆమోదిత రైలు ప్రాజెక్టులతో బీహార్‌లోని నర్కతియాగంజ్ రాక్సల్ సీతామరి దర్భాంగ , సీతామరి ముజఫర్‌పూర్ సెక్షన్‌లలో రైల్వే లేన్ల డబ్లింగ్ జరుగుతుంది.

ఈ పని 256 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలిగించేలా 57 కిలో మీటర్ల కొత్త రైల్వే లేన్ నిర్మాణం ఎర్రుపాలెం, నంబూర్ మధ్య అమరావతి మీదుగా జరుగుతుంది. పైన పేర్కొన్న రెండు ప్రాజెక్టులు కూడా కేంద్రంలోని ఎన్‌డిఎ మిత్రపక్షంగా ఉన్న టిడిపి, జెడియుల ప్రభుత్వాలు అధికారాల్లో ఉన్న రాష్ట్రాలకు మేలు కల్గిస్తాయి. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చేపట్టిన రైలు ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొంత మేర కొత్త రైల్వే లేన్‌కు అవకాశం ఏర్పడుతుంది. ఇక ఎర్రుపాలెం రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టిఆర్ విజయవాడ, గుంటూరు జిల్లాల మీదుగా వెళ్లుతుంది. ఇక బీహార్‌లో రైల్వే లేన్ డబ్లింగ్ పనులతో నేపాల్, ఈశాన్య భారతం, సరిహద్దు ప్రాంతాలకు మరింతగా రైల్వే అనుసంధానం ఏర్పడుతుంది. పైగా ఈ మార్గంలో ఎక్కువగా ప్యాసెంజర్ రైళ్లు, సరుకు రవాణా రైళ్లు ప్రయాణిస్తాయి. దీనితో ఈ ప్రాంతపు సామాజిక ఆర్థికవృద్ధికి దోహదం చేస్తుంది.

ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే ఇకపై భారతీయ రైల్వే నెట్‌వర్క్ విస్తీర్ణం 313 కిలోమీటర్ల మేర పెరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా కొత్తగా ఈ మూడు రాష్ట్రాలలోని మొత్తం 168 గ్రామాలకు రైల్వే సౌకర్యం ఏర్పడుతుంది. దాదాపు 12 లక్షల మందికి రైల్వే సౌకర్యం సమకూరుతుంది. కొత్తగా 9 రైల్వే స్టేషన్లు వెలుస్తాయి. డబ్లింగ్ పనులతో , మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుతో బీహార్‌లోని సీతామరి, ముజఫర్‌పూర్ జిల్లాల్లోని దాదాపు 388 గ్రామాలకు మొత్తం మీద 9 లక్షల మంది జనాభాకు ఉపయోగం కల్గుతుంది. కొత్త రైల్వే లైన్ నిర్మాణ ప్రతిపాదన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు త్వరలోనే రాజధాని కానున్న అమరావతికి నేరుగా ప్రయాణ సౌకర్యం ఏర్పడుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు, ప్రజల రాకపోకలకు వెసులుబాటు అవుతుందని అధికారులు వివరించారు. భారతీయ రైల్వే సేవల విశ్వసనీయత, సమర్థత మరింత ఇనుమడించేందుకు మార్గం ఏర్పడుతుంది.

మల్టీట్రాకింగ్‌పై రైల్వే దృష్టి
ఇప్పుడున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ఎక్కువగా రైల్వే లైన్ల విస్తరణపై దృష్టి సారించింది. రైల్వేల నిర్వహణ మరింత తేలిక అయ్యేందుకు , రూట్లలో రద్దీ తగ్గించేందుకు ఎక్కువ లైన్లను నిర్మించుకోవల్సిన అవసరాన్ని భారతీయ రైల్వే గుర్తించింది. ఎక్కువగా ప్రయాణికుల రద్దీ, సరుకుల రవాణా డిమాండ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో మల్టీట్రాక్ సిస్టమ్ వృద్థికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వల్ల ఆయా ప్రాంతాలలో రైల్వేల మౌలిక సాధనాసంపత్తి విస్తృతం అయ్యేందుకు వీలేర్పడుతుంది. ఇప్పుడు తలపెట్టిన రెండు రైల్వే ప్రాజెక్టులు కూడా ప్రధాన మంత్రి ఆలోచలనలకు అనుగుణంగా నవభారత్ నిర్మాణం కోణంలో రూపొందినవి అని పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఆయా ప్రాంతాలలో వినూత్న రీతిలో సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రజల్లో ఆత్మనిర్భరత కల్పించడం కీలకం అని వివరించారు. ఇటువంటి చర్యలతో ప్రజలకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు ఇనుమడింపచేసేందుకు దారి ఏర్పడుతుందని ప్రకటించారు. పిఎం గతి శక్తి జాతీయ బృహత్తర పథకం ద్వారా వివిధ ప్రాంతాలకు బహుళ స్థాయి అనుసంధానతను కల్పించడం కీలకం అవుతుందని తెలిపారు. ప్రజలు , సరుకులు సేవలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉండేలా ఇటువంటి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇప్పటి రైల్వే ప్రాజెక్టులకు ఆమోద దశలో అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News