న్యూఢిల్లీ : పంజాబ్ మాజీ సిఎం అమరీందర్ సింగ్ గురువారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ను కలుసుకున్నారు. ధోవల్ నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు అరగంట జరిగింది. అమరీందర్‌తో భేటీ తరువాత అజిత్ ధోవల్ హోం మంత్రి అమిత్‌షా నివాసానికి వెళ్లారు. బుధవారం అమరీందర్ రాజధానిలోనే అమిత్ షాతో చాలా సేపు సమావేశం అయ్యారు. చాలా రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. పంజాబ్‌లో అంతర్గత భద్రత విషయాల గురించి కెప్టెన్ ఇప్పుడు అజిత్ ధోవల్‌తో మాట్లాడినట్లు వెల్లడైంది. అమిత్‌షాతో సమావేశంలో కెప్టెన్ రైతుల సమస్యలను, వ్యవసాయ చట్టాల రద్దుకు ఏడాదిగా రైతులు సాగిస్తున్న ఉద్యమం గురించి ప్రస్తావించినట్లు తరువాత ఆయన అనుచరులు తెలిపారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటికైతే అటు బిజెపికి కానీ ఇటు కాంగ్రెస్‌కు కానీ సరైన అనుకూలత లేదని, జనం ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయని తన మనసులోని మాట చెప్పినట్లు వెల్లడైంది.