Saturday, November 16, 2024

కాంగ్రెస్ కు బిగ్ షాక్… మాజీ సిఎం అమరీందర్ సింగ్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Amarinder singh resigns congress party

హర్యానా: పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ”కాంగ్రెస్ పార్టీలో ఉండలేను.. బిజెపి పార్టీలో కూడా చేరడం లేదు. కొత్త పార్టీ పెట్టబోతున్నా” అని చెప్పారు. నిన్న అమరీందర్ సింగ్ అమిత్ షాను కలిశారు. దీంతో ఆయన బిజెపిలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. కాగా, ఇటీవల పంజాబ్ సిఎం పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను కాంగ్రెస్ తప్పించిన విషయం తెలిసిందే.

Amarinder singh resigns congress party

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News