Sunday, February 23, 2025

సినీ నటి శ్రీదేవికి కంటే ఎక్కువగా నటించారు: అమర్నాథ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: సినీ నటి శ్రీదేవికి మించి ఉండవల్లి శ్రీదేవి నటించారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఎంఎల్‌సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై అమర్నాత్ రీకౌంటర్ ఇచ్చారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి అభిమానిని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని, నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడేలా బయటకు వచ్చాయని ప్రశ్నించారు. ఉందవల్లి శ్రీదేవి లాంటి నమ్మక ద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఉండవల్లి శ్రీదేవికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని చురకలంటించారు. ఎంఎల్ సి ఎన్నికలలో వైసిపి ఎంఎల్ఎలు టిడిపి అభ్యర్థికి ఓటు వేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News