Wednesday, July 3, 2024

అమర్ నాథ్: తొలి రోజున 14000 మంది దర్శనం

- Advertisement -
- Advertisement -

పహల్గాం: దక్షిణ కశ్మీర్ హిమాలయాలలో ఉన్న అమర్ నాథ్ గుహను దాదాపు 14000 మంది భక్తులు శనివారం దర్శించుకున్నారు. ఇంకా వేలాది మంది భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. భక్తులలో వృద్ధులు, మహిళలు  సైతం మొక్కవోని దీక్షతో ముందుకు కదులుతున్నారు. చాలా మంది ప్రార్థనలు చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు.  వాతావరణం చల్లగా ఉన్నా, మంచు విపరీతంగా ఉన్నా, ఎత్తైన కొండ దారులలో కదులుతున్నారు.

వాలంటీర్లు, స్థానిక అధికారులు భక్తులకు రిఫ్రెష్మెంట్ స్టాళ్లు, మెడికల్ క్యాంపులు పెట్టి కష్టం కలగకుండా చూస్తున్నారు. హెలికాప్టర్ల ఆకాశంలో చక్కర్లు కొడుతూ నిఘా ఉంచుతున్నాయి.

మంచుతో ఏర్పడిన శివలింగాన్ని చూసి చాలా మంది కళ్లలో భక్తిభావంతో నీళ్లు తిరిగాయని సాక్షులు తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా వేలాది మంది దర్శనానికి కదులుతున్నారు. అమర్ నాథ్ యాత్ర మామూలు జర్నీ కాదు. అదో పవిత్ర యాత్ర.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News