Thursday, November 14, 2024

జులై 1 నుంచి అమర్‌నాథ్ యాత్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమర్‌నాథ్ యాత్ర జులై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్ లోని హిమాలయ పర్వతాల్లో 3880మీటర్ల ఎత్తున నెలకొన్న మంచులింగాన్ని దర్శించుకోడానికి భారీ ఎత్తున భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది భక్తులు రాగా, ఈసారి 5 లక్షల మంది వస్తారని అంచనా.

గత ఏడాది ఆకస్మికంగా వచ్చిన వరదలకు 16 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమర్‌నాథ్‌కు వెళ్లే బట్కల్, పహల్‌గామ్ దారుల్లో భారీగా మంచు పేరుకుని ఉండటంతో జూన్ 15 నాటికి మంచును తొలగించే పనిని బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టింది. మరోవైపు యాత్రను ఉగ్రవాదులు లక్షంగా చేసుకునే ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిక ల నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News