జమ్ము: భక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అమర్ నాథ్ యాత్ర శనివారం మొదలయింది. పవిత్ర గుహలో శివలింగ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 48 కిమీ. నున్వాన్-పహల్గామ్ మార్గం, 14 కిమీ. బల్తాల్ మార్గం గుండా యాత్రికుల మొదటి బ్యాచ్ కదిలింది. రెండు మార్గాలల్లోని యాత్రికుల బ్యాచ్ లను సంబంధిత డిప్యూటీ కమిషనర్లతో పాటు పోలీసు, సివిల్ అధికారులు సాగనంపారు.
జమ్మూలోని భగవతి నగర్ లోని యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుంచి 4603 భక్తుల మొదటి బ్యాచ్కు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా జెండా ఊపి పంపారు. 1881 మంది యాత్రికులు ఉన్న రెండో బ్యాచ్ ను కూడా భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి పంపారు.
భక్తుల రక్షణ కోసం పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసులను మోహరించారు. వైమానిక నిఘా కూడా పెట్టారు. ఇదిలావుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవిత్ర యాత్రకు ఉపక్రమించిన యాత్రికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుడి ఆశీస్సులతో భక్తులందరూ వర్ధిల్లాలని కోరారు.