దక్షిణ కాశ్మీర్‌లో 3880 మీటర్ల ఎత్తైన పవిత్ర గుహ క్షేత్రం అమర్‌నాథ్‌కు 38 రోజుల వార్షిక యాత్ర జూలై 3న మొదలవుతుందని అధికార ప్రతినిధి ఒకరు బుధవారం ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్మా అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్‌నాథ్ జీ ఆలయ మండలి 48వ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘ఈ ఏడాది యాత్ర రెండు మార్గాలు అనంతనాగ్ జిల్లా పహల్‌గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లా బల్తల్ నుంచి ఒకేసారి జూలై 3న ప్రారంభం అవుతుంది. అది ఆగస్టు 9న రక్షా బంధన్ రోజు పరిసమాప్తం అవుతుంది’ అని అధికార ప్రతినిధి తెలియజేశారు. ఆలయ మండలి సభ్యులు సమావేశానికి హాజరయ్యారని, భక్తుల కోసం సౌకర్యాలు, సేవల మెరుగుదలకు ప్రతిపాదిత చర్యలు, కార్యక్రమాలను సమావేశంలో చర్చించారని ఆయన చెప్పారు. అవసరాన్ని బట్టి బల్తల్, పహల్‌గామ్, నున్వాన్, పంథా చౌక్ శ్రీనగర్‌లలో సౌకర్యాలను తగిన రీతిలో పెంచాలని కూడా చర్చించారని ఆయన తెలిపారు.
జూలై 3 నుంచి వార్షిక అమర్‌నాథ్ యాత్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -