Wednesday, April 2, 2025

ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. 4.4 లక్షల మంది సందర్శన

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : ఏటా 62 రోజుల పాటు జరిగే అమరనాథ్ యాత్ర గురువారం ముగిసింది. దాదాపు 4,45,338 మంది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొని అమర్‌నాథ్ లింగాన్ని సందర్శించి పూజలు చేశారని అధికారులు వెల్లడించారు. జులై 1న బల్తాల్, పహల్‌గామ్ మార్గాల ద్వారా ప్రారంభమైన ఈయాత్రలో దాదాపు 48 మంది మృతి చెందారు. 62 మంది గాయపడ్డారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రలో పాల్గొనగా, ఈ ఏడాది అంతకన్నా ఎక్కువగా 4.4 లక్షల మంది పాల్గొనడం విశేషం. గురువారం తెల్లవారు జామున మహంత్ దీపింద్ర గిరి ఆధ్వర్యంలో సాధువులు, భక్తులు విచ్చేసి రోజు పొడవునా ప్రార్థనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News