హైదరాబాద్: అమర్ నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జూలై 01నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 17 నుంచి యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన రాజ్ భవన్ లో జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు 44వ సమావేవంలో యాత్ర షేడ్యూల్ ను నిర్ణయించారు.
Also read: రోగిని కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటన.. ఖండించిన ఆస్పత్రి సూపరింటెండెంట్
యాత్రికులకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, యాత్ర సజావుగా సాగేలా చూస్తామన్నారు. యాత్రికులకు వైద్య సేవలు, టెలికాం సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనంత్ నాగ్ జిల్లాలోని పెహల్గం ట్రాక్ నుంచి, గాందర్ బల్ జిల్లా బల్తాల్ నుంచి యాత్ర సమాంతరంగా మొదలవుతుందన్నారు. భక్తుల కోసం ఉదయం, సాయంత్రం జరిగే ప్రార్థనల ప్రత్యక్ష ప్రసారానికి బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.