Sunday, January 26, 2025

జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం

- Advertisement -
- Advertisement -

జమ్ముకాశ్మీర్ లో పవిత్ర అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. మొత్తం 53రోజులపాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుందని అమర్నాథ్ బోర్డు తెలిపింది. లక్షల మంది భక్తులు వచ్చే ఈ యాత్రకు వెళ్లే రెండు రహదారుల్లో 12 క్రిటికల్ స్పాట్స్‌ను గుర్తించామని తెలపింది.

ఈ ప్రాంతాల్లో భక్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే.. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కూడిన మౌంటైన్ రెస్క్యూ టీమ్స్‌ సహాయం అందిస్తాయని చెప్పింది. సహాయక చర్యలు చేపట్టేందుకు జమ్ముకాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన 1,300 మంది సిద్ధంగా ఉంటారని తెలిపింది. కాగా, ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా గురువారం పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News