శ్రీనగర్: కశ్మీరులో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అమర్‌నాథ్ యాత్రను రెండు మార్గాలలో నిలిపివేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. అననుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పహల్‌గామ్‌తోపాటు బల్టామ్ మార్గాల ద్వారా సాగే అమర్‌నాథ్ యాత్రను గురువారం ఉదయం నుంచి తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. వాతావరణం మెరుగుపడిన తర్వాత అమర్‌నాథ్ గుహలో వెలసిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులను యాత్రకు అనుమతిస్తామని వారు చెప్పారు. ఇలా ఉండగా..కుల్గామ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి లోనుకావడంతో 8 మంది యాత్రికులు గాయపడ్డారు. 40 మంది యాత్రికులతో బల్టాల్ బేస్ క్యాంపునకు వెళుతున్న బస్సు అదుపుతప్పి ఖాజీగుండ్‌లోని నుసూ బడేర్‌గుండ్ సమీపంలో జాతీయ రహదారిపై ఒక టిప్పర్ డంపర్‌ను ఢీకొందని అధికారులు తెలిపారు. వీరిలో ఆరుగురికి ప్రథమ చికిత్స చేయగా ఇద్దరిని మాత్రం అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మళ్లీ నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -