శ్రీనగర్: దక్షిణ కశ్మీర్ లోని అమర్ నాథ్ గుహకు అమర్ నాథ్ యాత్ర జూన్ 29 నుంచి 19 ఆగస్టు 2024 వరకు జరుగనున్నది. ఈ యాత్ర చేయడానికి భక్తులు, సాధువులు, సాధ్వీలు వేచి ఉన్నారు. 52 రోజుల ఈ అమర్ నాథ్ యాత్ర లో పాల్గొనే పవిత్ర యాత్రికులను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నేడు(గురువారం) స్వాగతం పలికింది.
అమర్ నాథ్ యాత్ర సుదూరంగా ఉండే లిడర్ లోయలో ఉంటుంది. శివుడు ఉండే అమర్ నాథ్ గుహకు రెండు దారులు ఉన్నాయి. ఒకటి అనంత్ నాగ్ లోని నున్వన్-పహల్గామ్ రూట్ అయితే, రెండోది గందెర్బల్ లో ఉండే ఎత్తైన బల్తల్ రూట్. ఈ బల్తల్ రూట్ షార్ట్ రూట్ అయినప్పటికీ చాలా ఎత్తుగా ఉంటుంది.
అమర్ నాథ్ యాత్రలో పాల్గొనేవారు చేయాల్సినవి:
తమ ఆర్ఎఫ్ఐడి కార్డులను జమ్మూకశ్మీర్ లోని నిర్ధారిత ప్రదేశంలో యాత్ర కంటే ముందే పొందాల్సి ఉంటుంది.
యాత్రలో ఎల్లప్పుడూ ఎస్ఎఎస్ బి జారీచేసిన ఆర్ఎఫ్ఐడి కార్డులను తప్పనిసరి ధరించాలి.
యాత్రలో సౌఖ్యంగా ఉండే దుస్తులు ధరించాలి.
యాత్రికులు ట్రెక్కింగ్ షూస్ ధరించాలి.
యాత్రికులు పైకి ఎక్కుతున్నప్పుడు మెల్లగా ఎక్కాలి. మధ్యమధ్యలో విశ్రమించాలి.
శరీరంలో తేమ పాళ్లు (హైడ్రేటెడ్) ఉండేందుకు తగినంత నీరు త్రాగాలి.
ఊపిరి సరిగా ఆడకపోయినా, అసౌఖర్యంగా ఫీల్ అయినా దగ్గరిలోని వైద్య సదుపాయాన్ని సంప్రదించాలి. వీలయితే దిగువకు (లోయర్ అల్టీట్యూడ్) దిగాలి.
యాత్రికులు చేయకూడనివి:
ఆర్ఎఫ్ఐడి కార్డు లేకుండా ఏ యాత్రికుడు యాత్ర ప్రాంతంలోకి ప్రవేశించరాదు.
యాత్రికులు తమకు చేతకాక పోయినా శ్రమించకూడదు. వీలయితే మార్గమధ్యంలో తరచూ విరామం, విశ్రాంతి తీసుకోవాలి.
యాత్రికులు దారిలో(ట్రెక్కింగ్ రూట్ లో) చెత్తాచెదారం వేయకూడదు. పరిసరాలను కలుషితం చేయకూడదు.
యాత్రికులు ఖాళీ కడుపుతో(తినకుండా) యాత్ర చేయొద్దు.
యాత్రికులు మత్తుపానీయాలు, పొగత్రాగడం, కాఫీలు వంటివి త్రాగడం చేయకూడదు.
యాత్రికులు షార్ట్ కట్ రూట్ లను ఎంచుకోరాదు. ‘డేంజర్ జోన్’ సైనేజ్ లు గమనించాలి.
స్పాట్ రిజిస్ట్రేషన్:
అడ్మినిస్ట్రేషన్ గురువారం నుంచే భక్తుల స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలెట్టారు.
యాత్రికులు రిజిస్ట్రేషన్ సెంటర్ లలో తమ పేరు నమోదు చేయించుకోవాలి. ముఖ్యంగా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోనివారు.
సాధువుల రిజిస్ట్రేషన్ కోసం పురానీ మండీలోని రామ్ టెంపుల్ కాంప్లెక్స్ లో ప్రత్యేక రిజిస్ట్రేషన్ క్యాంప్ తెరిచారు.
జమ్మూలోని రిజిస్ట్రేషన్ సెంటర్లలో రోజుకు 600 మందినే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు.