- అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు ఉప్పల భూపతి
సిద్దిపేట: అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని అమర్నాద్ అన్నదాన సేవా సమితి అద్యక్షుడు ఉప్పల భూపతి అన్నారు. సోమవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వ జన్మ సుకృతంగా బావిస్తున్నామన్నారు. అమర్నాద్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమర్నాథ్ సేవా మండలి అమృత్సర్ సహకారంతో బాల్తాల్ వద్ద, బోలే బండారి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పంచతరని వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి బోజన వసతి కల్పిస్తున్నామన్నారు.
13న సిద్దిపేట శరబేశ్వర ఆలయం నుండి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు. ఈ సరుకుల లారీని మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. ఉదయం 8 గంటల శరబేశ్వర ఆలయంలో శివ కల్యాణోత్సవం, 11 గంటలకు వాహన పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అమర్నాద్ వెళ్లేభక్తులందరూ బాళ్తాల్ వద్ద గల 8వ నెంబర్ లంగర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కైలాసం, మదుసూదన్, పరమేశ్వర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.