Sunday, December 22, 2024

వారం ముందే అమర్‌నాథ్ యాత్రముగింపు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : వార్షిక అమర్‌నాథ్ యాత్రను వచ్చే బుధవారం నుంచి నిలిపివేస్తున్నారు. సాధారణంగా ముగిసే వార్షిక యాత్రను వారం రోజుల ముందుగానే నిలిపివేయనున్నారు. తక్కువ సంఖ్యలోనే యాత్రికులు రావడంతో యాత్ర నిలిపివేత నిర్ణయం తీసుకున్నారు. అమర్‌నాథ్ దేవస్థానం మండలి ఛైర్మన్‌గా జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఈ పుణ్య గుహక్షేత్రానికి ఇప్పటివరకూ 4 లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శనకు వచ్చినట్లు సిన్హా తెలిపారు.

అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగినట్లు , భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, ఉగ్రవాద దాడుల భయాలతో ఇటీవలి కాలంలో అమర్‌నాథ్‌యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. 2012లో యాత్రికుల సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. కాగా 2022లో ఇది 3 లక్షల పైచిలుకు వరకూ ఉంది. ఈసారి ఇది 4 లక్షలు దాటింది.వార్షిక యాత్రను అధికారికంగా కుదించివేసినా, ఈ నెల 31వ తేదీ వరకూ దివ్య ఆశీస్సులు పొందే ఘట్టం సాగుతుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News