Monday, December 23, 2024

చెరువుగట్టులో అమావాస్య సందడి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ : తెలంగాణ శైవ క్షేత్రమైన నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావటంతో జిల్లా నలుమూలల నుండి చెరువుగట్టుకు పోటేత్తారు. కొండ పైన గల గర్బాలయంలో తెల్లవారుజామున శాస్త్రోక్తంగా పరమశివుడుకి పంచామృత అభిషేకములు ఘనంగా నిర్వహించారు.

అనంతరం మహామండపంలో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం లక్షపుష్పార్చన కార్యక్రమం పార్వతి పరమేశ్వరులకు కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు రామలింగేశ్వరశర్మ, కార్యనిర్వాహణాధికారి నవీన్, సూపర్నిడెంట్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

కాగా చెరువుగట్టులో వేలాది మంది భక్తులు దేవాలయ సందర్శనానికి తరలి రావటంతోచెరువుగట్టులో గల ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ రంగాశేఖర్, మీలా సోమయ్యలతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు కందగట్ల శ్రీనివాస్, వాస నగేష్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News