Monday, December 23, 2024

భక్తిశ్రద్ధలతో కేతకిలో అమావాస్య పూజలు

- Advertisement -
- Advertisement -
  • కేతకీలో భారీగా భక్తులు

ఝరాసంగం: హరహర మహాదేవ శంభోశంకరeఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో నినాదాలతో ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం మారుమోగింది. సోమవారం అమావాస్య, సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు ఉదయం 5 గంటల నుండి బారులు తీరారు. అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకము, మంగళ హారతి, రుద్రాభిషేకం, అలంకరణ, అమ్మవారికి కుంకుమార్చన, మహా నైవేద్యము,మహా మంగళహారతి అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర,భక్తులు భారీ సంఖ్యలోస్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు. భక్తులు అమృత గుండంలో స్నానాలు ఆచరించి శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి దర్శించుకున్నారు.

అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ నీలా వెంకటేశం, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శశిధర్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ శివకుమార్ పాలకమండలి సభ్యులు సజ్జన్, నాగన్న, లక్ష్మయ్య, మల్లికార్జున్, సంగన్న, ఆలయ సిబ్బంది అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఝరాసంగం ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన వితరణ వితరణ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News