Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ హయాంలో అబ్బురపరిచే అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మధిర : సిఎం కెసిఆర్ దార్శనికత, యువ నాయకుడు, మంత్రి కెటిఆర్ దిశ నిర్దేశకత్వం, నాయకత్వంలో తెలంగాణలో తొమ్మిదేళ్లలో ప్రపంచాన్ని అబ్బురపరిచే రీతిలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని బీఆర్‌ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.

శుక్రవారం పండుగ వాతావరణంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత అధ్యక్షతన మధిరలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు మాట్లాడారు. కెసిఆర్ విప్లవాత్మకమైన సరికొత్త ఆలోచనలు, సంస్కరణల ఫలితంగానే దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి జరుగిందని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పిరేషన్లు అనూహ్య ప్రగతిలో దూసుకుపోతు న్నాయని అన్నారు. కుంఠ దామాల నిర్మాణం ఒక చరిత్ర అన్నారు. తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారని అన్నారు. పపంచమే అబ్బురపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని కెసిఆర్ అభివృద్ధి చేశారని అన్నారు.

రాబోయే కాలంలో కెసిఆర్‌కు మరింత అండగా ఉండి, మంచి మెజార్టీతో గెలిపించుకొని, మరింత అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాలోని 10 సీట్లను గెల్చుకొని కెసిఆర్‌కు బహుమతిగా ఇద్దామని నామా అన్నారు.ఈ సందర్భంగా వేదికపై మున్సిపల్ కార్మికులను సన్మానించారు. అంతకు ముందు నామా మీటింగ్ హాలు వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బతుకమ్మలతో స్వాగతం పలికారు.మధిర మున్సిపల్ ఛైర్ పర్సన్ మొండితోక లత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు , జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, పార్టీ నాయకులు వెంకట రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, మొండితోక జయాకర్, రంగిశెట్టి కోటేశ్వరరావు, చావా రామకృష్ణ, కనుమూరి వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, చావా వేణు, దిశ వెంకటేశ్వర్లు, అప్పారావు, మల్లాది వాసు, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ రమాదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News