Sunday, December 22, 2024

దశాబ్ధకాలంలోనే వ్యవసాయరంగంలో అద్భుత పురోగతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసిఆర్ దిశానిర్దేశంతో దశాబ్ధకాలంలోనే రాష్ట్రం వ్యవసాయరంగంలో అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతవరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా జూన్ 3న నిర్వహించే తెలంగాణ రైతుదినోత్సవం కార్యక్రామలకు సంబంధించి రైతుబంధు సమితి కార్యాలయంలో బుధవారం జిల్లా కోఆర్డినేటర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 201415తో పోలిస్తే వరి ఉత్పత్తిలో దేశం 15వ స్థానం నుంచి ప్రధమ స్థానం , ఉత్పాదకతలో ద్వితీయ స్ధానానికి చేరుకుందని వెల్లడించారు. ఈ ప్రగతి సిఎం కేసిఆర్ ఆదర్శపాలనకు తార్కాణం అన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా అకాల వర్షాల వల్ల పంట నష్టాలు జరగకుండా ముందస్తు వరి సాగు ప్రణాళికలపైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడుతూ 2014నుంచి ఇప్పటివరకూ దశాబ్ధ కాలంలో రైతుల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి సమకూర్చిందని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో రైతు దినోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News