Monday, December 23, 2024

అద్భుతంగా రామ చంద్రస్వామి ఆలయం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని అద్భుతంగా నార్కెట్‌పల్లి మం డలం చిన్నతుమ్మలగూడెం గ్రామ శివారులో నిర్మించడం అభినందనీయ ం అని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి ,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం జరిగిన మండల పూజా కార్యక్రమంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవాలయాలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ,నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భా వాన్ని అలవరుచుకుని మానవ జన్మను సార్థకం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. సుందరంగా , అద్భుతంగా సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని నిర్మించిన భక్తులను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, ఎంపిపి సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి , ఎంపిటిసి పుల్లెంల ముత్తయ్య,బొక్కా కనకమ్మ,భూపాల్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News