Monday, December 23, 2024

మిషన్ భగీరధతో అద్భుత ఫలితాలు

- Advertisement -
- Advertisement -
ప్రజలకు సేవలు అందిస్తే మనసుకు సంతృప్తి
మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సబర్వాల్

మనతెలంగాణ/హైదరాబాద్ : తాగునీటి రంగంలో మిషన్‌భగిరధ అద్భుతమైన ఫలితాలను అందిస్తోందని మిషన్‌భగీరధ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. సోమవారం రాఘవపూర్ నీటి శుద్ధి కేంద్రం ఆవరణలో నిర్మించిన శిక్షణ కేంద్ర భవనానికి మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ జి. కృపాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా రెండు రోజులు నిర్వహించిన మిషన్ భగీరథ సహాయకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణ పొందిన మిషన్ భగీరథ సహాయకులు చేయాల్సిన పనులు, శిక్షణలో పొందిన అనుభూతులపై వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మిషన్ భగీరథ సహాయకుల నుద్దేశించి స్మిత సబర్వాల్ మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి కోటికి పైన కుటుంబాలకు రక్షిత మంచి నీరును అందించడం జరుగుతుందన్నారు. ఏదొక జన్మలో చేసిన పుణ్యమో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించి గౌరవం పెంచుకోవాలని ఆమె సూచించారు. మిషన్ భగీరథ నీటి ద్వారా కలిగే ప్రయోజనాలను శిక్షణ పొందిన సహాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు. గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా పైపుల లీకేజీలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ సర్వీసుల మేరకు అనుభవమున్న వీఆర్‌ఏలు మిషన్ భగీరథలో ఉద్యోగం పొందిన మీరు ఇంకా మెరుగైన సేవలందించవచ్చని ఆమె అన్నారు. ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులకు మిషన్ భగీరథలో మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ప్రజలకు అందించడంలో ప్రజా ప్రతినిధుల సహకారం అవసరమని ఆమె అన్నారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ త్రాగునీరు మంచిగా ఉంటే ప్రజల జీవన పరిణామాలు బాగుంటాయన్నారు. బ్రతకడానికి నీరు ఎంతో అవసరమని అలాంటి మంచినీరు ప్రజలకు అందిస్తే ఆదాయం ఇచ్చిన వారమవుతామని కలెక్టర్ తెలిపారు. గతంలో గ్రామ రెవెన్యూ సహాయకుల నుండి ప్రభుత్వం శాశ్వత ఉద్యోగస్తులుగా నియామకాలు ఇవ్వడం జరిగిందని, బాధ్యతను గుర్తెరిగి పూర్తిస్థాయిలో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు మంచి సేవలందిస్తూ గర్వంగా చెప్పుకునేలా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ ద్వారా మన బాధ్యత తగ్గట్టుగా పని చేయాలని కలెక్టర్ హితవు పలికారు.ఈ కార్యక్రమాల్లో మిషన్ భగీరథ ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీప్ ఇంజనీర్లు చెన్నారెడ్డి, జ్ఞాన్ కుమార్, రాంచందర్, లలిత, వినోబా దేవి, చంద్రమౌళి, మధుబాబు, ఎస్‌ఇ ఆంజనేయులు, ఇఇ బాబు శ్రీనివాస్, డిఆర్డిఓ కృష్ణన్, ఆర్డిఓ విజయకుమారి, తాహాసిల్దార్ దానయ్య, ఎంపీడీవో శేషగిరి శర్మ, ఎంపీఓ దయానంద్, రాగవపూర్ , జాఫర్ పల్లి సర్పంచులు జగన్, అనిత లు పాల్గొన్నారు. అనంతరం మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ఆవరణలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మొక్కను నాటి నీరు పోశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News