Wednesday, January 22, 2025

పట్టణ ప్రగతితో అద్భుత ఫలితాలు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక స్వయం పాలనలో పట్టణాల ప్రాంతాల్లో మౌలిక వసతులు, మెరుగైన పారిశుద్ధ్యం, పచ్చదనం మెరుగుదాలే లక్ష్యంగా మొదలుపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసర ఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుద్ధ్య వాహనాల ర్యాలీని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలసి ర్యాలీని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు.

ర్యాలీ అంబేద్కర్ స్టేడియం నుండి పారిశుద్ధ్య ట్రాక్టర్లు, నీటి సరఫరా ట్యాంకర్లు, ఫాగింగ్ ఆటోలు, డంపర్ ప్లేసర్ లు, స్లీపింగ్ మిషన్ వాహనాలు, కంపాక్టర్స్, ఎక్సవేటర్, డిఆర్‌ఎఫ్ వెహికల్స్, జట్టింగ్ మెషిన్, తిల్టింగ్ మెషిన్, హరితహారం ట్యాంకర్లు, స్మార్ట్ సిటీ క్రేన్ కంపాక్టర్, ఎక్స్ల వేటర్, బ్లేడ్ ట్రాక్టర్లు, స్వచ్ ఆటోలు, చెత్త సేకరించే ట్రై సైకిళ్లు, సానిటేషన్ ట్రాక్టర్లు వాహనాలతో ర్యాలీ తెలంగాణ చౌక్ వరకు వెళ్ళింది.

తెలంగాణ చౌక్ వద్ద వాహనాల ర్యాలీని మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ప్రతి పట్టణం, నగరం ప్రగతి కాంతులతో కలకలాడుతున్నాయని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్,డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వరరావు, ఎస్ ఈ నాగమల్లేశ్వరరావు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News