ముంబై: ప్రపంచంలోనే అత్యంత జనాదారణ కలిగిన క్రికెట్ లీగ్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రసార హక్కులను సొంత చేసుకునేందుకు పలు బడా కంపెనీలు రంగంలోకి దిగనున్నాయి. ఐపిఎల్ బ్రాడ్‌కాస్ట్ రైట్స్‌ను దక్కించుకునేందుకు బడా వాణిజ్య సంస్థలు అమెజాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ పోటీ పడుతున్నాయి. ఈ హక్కులను సొంతం చేసుకునేందుకు ఇటు రిలయన్స్ అటు అమెజాన్ సంస్థలు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఐపిఎల్ టివి, డిజిటల్ ప్రసార హక్కుల కోసం వచ్చే ఐదేళ్లా కాలానికి పెద్ద మొత్తంలో చెల్లించేందుకు రెండు సంస్థాలు ముందుకొచ్చాయి. ఈ క్రమంలో ఏకంగా రూ.50 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు ఈ సంస్థలు సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఐపిఎల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియా, సోనీ గ్రూప్, జీ ఎంటర్‌ప్రైజెస్‌లు కలిగి ఉన్నాయి. ఈ ఏడాదితో వీటి గడువు ముగియనుంది. వచ్చే ఏడాది నుంచి ఐదేళ్ల పాటు కొత్త సంస్థలకు ఈ హక్కులను ఇచ్చేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేసంది. దీంతో ఎలాగైన ఈ హక్కులను సొంతం చేసుకునేందుకు రిలయన్స్, అమెజాన్ సంస్థలు రంగంలోకి దిగాయి.
Amazon and Reliance likely to get IPL Broadcasting rights