బెంగళూరు: ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ‘అమెజాన్’ ఈ సంవత్సరం 10,000 ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలను, 2030 నాటికి 100,000 వాహనాలను అభివృద్ధి చేయడానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు ‘రివియన్’తో కలిసి పని చేస్తోంది. డిజైన్ దశలోనే ఉన్నప్పటికీ, అనేక ఫీచర్లు డ్రైవర్ సామర్థ్యాన్ని పెంచడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
గత వారం, రివియన్ అధికారికంగా అమెజాన్ కోసం పెద్ద ఈడివిా-700 ఎలక్ట్రిక్ డెలివరీ వ్యాన్‌ను ఆవిష్కరించింది, గత సంవత్సరం మొదటి ప్రీ-ప్రొడక్షన్ వ్యాన్‌లు పంపిణీ చేయబడినప్పటి నుండి ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం యొక్క ఫ్లీట్ గణనీయంగా పెరిగిందని ప్రకటించింది. రివియన్ సిిిఇఓ ఆర్జె స్కెరింజే అమెజాన్ ప్రకటనకు ముందు ‘రాయిటర్స్’తో మాట్లాడారు. స్టార్టప్ వివిధ ఆకారాలు, పరిమాణాలలో విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.