Monday, December 23, 2024

అమెజాన్ ఫుడ్ డెలివరీ మూసివేత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఈ కామర్స్ దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి భారత్‌లో ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను మూసివేస్తున్నామని అమెజాన్ ప్రకటించింది. స్విగ్గీ, జొమాటోతో పోటీపడలేక వెనక్కి తగ్గిన అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను విరమించుకోనున్నట్లు తెలిపింది. 2020 కొవిడ్ మహమ్మారి కాలంలో నిత్యవసరాల కోసం చేయడంతోపాటు అమెజాన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలని కస్టమర్లు కోరారు. దీంతో వినియోగదారుల డిమాండ్ మేరకు అమెజాన్ భారత్‌లో 20బిలియన్ డాలర్లు పెట్టుబడిగా ఫుడ్ సర్వీస్‌లను బెంగళూరు వేదికగా తొలుత ప్రారంభించింది.

ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు టెక్ క్రంచ్ తెలిపింది. డిసెంబర్ 29వరకు ఒప్పందం చేసుకున్న రెస్టారెంట్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అనంతరం అమెజాన్ ఫుడ్ ఆర్డర్లను నిలిపివేస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. దేశంలోని హైస్కూలు విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ అకాడమీని మూసివేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఫుడ్ డెలివరీ బిజినెస్ కూడా అమెజాన్ ప్రకటించింది. కాగా ఈ కామర్స్ దిగ్గజంప్రపంచవ్యాప్తంగా మంది ఉద్యోగులను తొలగించనుందని గతవారం నివేదించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News