Sunday, December 22, 2024

అమెజాన్ విస్తరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్‌ను విస్తరించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్లూఎస్) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు.తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాద్‌లో ఉంది. గతేడాది అమెజాన్ డెడికేటేడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్‌ను ‘అమెజాన్ ఎయిర్’ ప్రారంభించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు (ఏడబ్లూఎస్) సంబంధించి హైదరాబాద్‌లో మూ డు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.

అమెజాన్‌తో చర్చలు విజయవంతం : మంత్రి శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం త రఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమ మైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ విస్త రణకు కంపెనీ మందుకు వస్తుందన్న ఆశా భావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ మా ట్లాడుతూ హైదరాబాద్‌లో తమ క్లౌడ్ సదుపా యాలను మరింత విస్తరించే అవకాశాలపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమెజా న్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరా బాద్ కీలక పాత్ర పోషిస్తుం దని ఆయన అభిప్రా యం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకు నేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుం డా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News