Saturday, January 11, 2025

దేశంలో 60కి పైగా నగరాలకు విస్తరిస్తున్న అమెజాన్ ఫ్రెష్..

- Advertisement -
- Advertisement -

అమెజాన్ ఇండియా ఈ రోజు, భారతదేశవ్యాప్తంగా 60కి పైగా నగరాలకు తన పూర్తి బాస్కెట్ గ్రోసరీ సేవ అయిన అమెజాన్ ఫ్రెష్­ను విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్ ఫ్రెష్ యాప్-ఇన్-యాప్ అనుభవం – పండ్లు, కూరగాయలు, శీతల ఉత్పత్తులు, సౌందర్య, శిశు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, పెంపుడు జంతువులక ఉత్పత్తులతో సహా ఇతర రోజువారి కిరాణా సామాగ్రులుతో సహా విస్తృత శ్రేణి గ్రోసరీ ఉత్పత్తులను – మీకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ నగరాల్లోని కస్టమర్లు అన్ని గ్రోసరీ ఉత్పత్తుల పై ఆకర్షణీయమైన వారాంతపు సేల్, ప్రతి నెల 1 నుండ 7వ తేదీ వరకు సూపర్ వాల్యూ డేస్, తమకు కావలసిన టైమ్ స్లాట్­లో డెలివరీని పొందే సౌకర్యం ద్వారా వాల్యూ ఆఫర్లను పొంది ఆనందించగలుగుతారు.

శ్రీకాంత్ శ్రీ రామ్, హెడ్, అమెజాన్ ఫ్రెష్ ఇలా అన్నారు, “అమెజాన్ ఫ్రెష్, కస్టమర్లకు విస్తృతమైన శ్రేణిని, సాటిలేని విలువను, సౌకర్యాన్ని అందించే వన్ స్టాప్ ఆన్­లైన్ డెస్టినేషన్. మా కస్టమర్లకు సేవలు అందించేందుకు మేము నిబద్దులమైన ఉన్నాము. అంతే కాక, ‘ప్రతిరోజు’, ‘ప్రతీది’ అందించే స్టోర్ కావాలన్న సంకల్పం మాకు స్ఫూర్తిని ఇస్తూంటుంది. మామిడిపండ్ల వంటి సీజనల్ ఉత్పత్తులకు మరియు ఈ సీజన్­లో వేసవికి కావలసిన ఉత్పత్తులకు మంచి డిమాండు ఉండటం మేము గమనించాము. దేశవ్యాప్తంగా మా వినియోగదారులకు అత్యుత్తమమైన ఆన్­లైన్ షాపింగ్ అనుభవాన్ని కల్పించటం పై మేము మా దృష్టిని నిగిడ్చి ఉంచటం కొనసాగిస్తాము.”

Amazon.in ఆఫర్ చేస్తోంది ఫ్రీ షిప్పింగ్, అనగా రూ. 249 కన్నా ఎగువ విలువ కలిగిన ఆర్డర్ల పై *ఉచిత డెలివరీ. నెలకు సరిపడ సామాన్లను తీసుకోవాలని కోరుకున్నప్పుడు మరింత ఎక్కువ సొమ్ము ఆదా చేసుకునేందుకు కస్టమర్లకు సహాయపడే సూపర్ సేవర్ డీల్సుతో వారు మరింత లబ్దిని పొందగలుగుతారు. గొప్ప ఆదా, విస్తృతశ్రేణి ఉత్పత్తులు, వేగవంతమైన, సౌకర్యవంతమైన డెలివరీ ఆప్షన్లు ఒక సింగిల్ ఆన్­లైన్ డెస్టినేషన్­లో అందించటం మాత్రమే కాక, అమెజాన్ ఫ్రెష్ ఒక సరళమైన షాపింగ్ అనుభవాన్ని, గ్రోసరీల కోసం ప్రత్యేకించిన యాప్-ఇన్-యాప్, సౌకర్యవంతమైన వ్యక్తిగతీకరించిన విడ్జెట్లు, మరలా కొనే ఆప్షన్లు మరియు తరచుగా కొనే వస్తువులను చెక్­అవుట్ సమయంలో మరిచిపొకుండా రిమైండర్­ల సౌకర్యం అందిస్తుంది. సులభంగా ఎంపికచేసుకోగలగటాన్ని, నావిగేషన్­­స పట్ల కస్టమర్లు ముచ్చటపడతారు. ఇటీవల మేము విడుదల చేసిన పలు ఇతివృత్తాల కథలు మరియు మ్యాంగో ఫీస్టా, వేసవి అవసరాల స్టోర్, స్నాక్ అండ్ స్ట్రీమ్ స్టోర్ వంటి ఈవెంట్లు, కస్టమర్లకు మా యావత్తు ఉత్పత్తుల శ్రేణి నుండి ఉత్తమమైన విలువను, అధిక-నాణాయత కలిగిన కిరాణా సామాగ్రులను ఆఫర్ చేస్తాము.

అమెజాన్ ఫ్రెష్ ఇటీవల, అమెజాన్ ఫ్రెష్ ఎందుకు ఎంచుకోవలసిన భాగస్వామో తెలియచేసే “నహీ తో మెహంగా పడేగా” అనే ఒక బ్రాండ్ క్యాంపెయిన్ విడుదల చేసింది. దీని ద్వారా విస్తృత శ్రేణి ఉత్పత్తులను, గొప్ప ఆదాను, ఉత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను తన విక్రేతల నుండి తమకు నచ్చిన డెలివరీ స్లాట్­లలో కస్టమర్లు పొందగలుగుతారు. ఆ క్యాంపెయిన్ వీడియోను మీరు చూడగలుగుతారు ఇక్కడ.

గమనిక: ఉత్పత్తుల క్లెయిమ్­లు, వివరాలు, వివరణ, ధరలు, విక్రేతలు అందించిన మేరకు తెలుపబడినవి. ధరనిర్ధారణలో, ఉత్పత్తుల వివరణలో అమెజాన్­కు ప్రమేయము లేదు, విక్రేతలు అందించిన ఉత్పత్తుల సమాచారంలో ఖచ్ఛితత్వానికి అమెజాన్­ది బాధ్యత కాదు. డీల్స్ మరియు డిస్కౌంట్లను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్లు అందిస్తాయి, దీనితో అమెజాన్­కు ప్రమేయం లేదు. ఉత్పత్తి వివరణలు, నాణ్యత గురించిన వాగ్దానాలు, ఫీచర్లు మరియు డీల్స్­ను విక్రేతలు అందించగా, యథాతథంగా ఉటంకించటమైనది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News