సీయెటెల్(వాషింగ్టన్): ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. వరల్డ్ వైడ్ కన్జూమర్ బిజినెస్ సీఈవో డేవ్‌క్లార్క్ అమెజాన్‌కి గుడ్‌బై చెప్పారు. ఆ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. 2022 జులై 1తో ఆయన అమెజాన్‌తో పూర్తిగా బంధం తెంచుకోబోతున్నారు. కాలేజీలో ఎంబీఏ పట్టా పుచ్చుకోవడం ఆలస్యం 1999లో డేవ్‌క్లార్క్ అమెజాన్‌లో చేరారు. అప్పటికీ ఈ-కామర్స్ రంగం ఇంకా శైశవ దశలోనే ఉండింది. అప్పటి నుంచి జెఫ్ బేజోస్‌తో కలిసి పని చేస్తూ అంచెలంచెలుగా అమెజాన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీగా తీర్చి దిద్దారు.
డేవ్‌క్లార్క్ తమ సంస్థను వదిలి వెళ్తున్న విషయంపై అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇదే విషయాన్ని అధికారికంగా అమెరికా స్టాక్ మార్కెట్ అధికారులకు సైతం తెలిపింది. కంపెనీతో అభిప్రాయ బేధాలు ఏమీ లేవని , ఇతర చోట పని చేయాలనే ఉద్దేశంతోనే క్లార్క్ తమ సంస్థను వీడినట్టు అమెజాన్ వివరణ ఇచ్చింది.
ఆన్లైన్ రిటైలర్ ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కొంటోంది, ఇటీవల ఎక్కువ గిడ్డంగులు నిర్మించడం, రవాణా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా $2 బిలియన్లను కోల్పోయినట్లు నివేదించింది, ఇప్పుడు ఆర్డర్లను నెరవేర్చడానికి అయ్యే ఖర్చులను తగ్గించుకుంటానని ప్రతిజ్ఞ చేసింది.