Sunday, November 3, 2024

అక్టోబర్ 4 నుంచి ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ’

- Advertisement -
- Advertisement -

amazon
బెంగళూరు: ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ను అక్టోబర్ 4 నుంచి మొదలెడుతుందని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు మనీశ్ తివారీ శుక్రవారం తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గ్రాసరీ వంటి వాటి అమ్మకాల ఉద్యమాన్ని(డ్రైవ్)ను నిర్వహించనున్నామని కూడా ఆయన తెలిపారు.
ఈ ఫెస్టివల్ డ్రైవ్‌లో 450 నగరాలకు చెందిన 75000 స్థానిక దుకాణాలు సహా లక్షలాది మంది అమ్మకందార్లు తమ ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్ముతారని సమాచారం.
అమెజాన్ ఇండియా ఏర్పాటు చేసిన ఇటీవల అధ్యయనాన్ని నీల్‌సెన్ నిర్వహించింది. జరిపిన సర్వేలో అమ్మకపుదారులు టెక్నాలజీ వినియోగించడం, ఇ-కామర్స్ తమ వ్యాపారాలపై సానుకూల ప్రభావాన్నే చూపిందని చెప్పారని ఆ అధ్యయనంలో వెల్లడయింది. అమెజాన్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 98 శాతం అమ్మకందారులు తాము కొత్త కస్టమర్ల వద్దకు చేరుకుంటామన్నారు. 71 శాతం మంది తమ అమ్మకాలు పెంచుకుంటామన్నారు. పండుగ సీజన్‌లో తమ అమ్మకాలు ఊపందుకోగలవన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తంచేశారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో టాప్ బ్రాండ్లయిన శాంసంగ్, వన్‌ప్లస్, జియోమి, సోని, ఆపిల్, బోట్, లెనోవా, హెచ్‌పి తదితరాలు 1000కిపైగా తమ కొత్త ఉత్పత్తులను లాంఛ్ చేయగలవని భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News