బెంగళూరు: తమ నెల రోజుల పాటు కొనసాగే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (ఏజిఐఎఫ్) 2024 దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లు, విక్రేతలు, బ్రాండ్ భాగస్వాముల కోసం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత ఉత్తమమైన షాపింగ్ సంబరంగా నిలిచిందని అమేజాన్ ఇండియా ఈ రోజు ప్రకటించింది. ఏజిఐఎఫ్ 2024 సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమైంది. 24 గంటల ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ తో, ల్యాప్ టాప్స్, టివిలు, స్మార్ట్ ఫోన్లు, ఫ్యాషన్ మరియు బ్యూటీ, హోమ్ డెకార్, ఉపకరణాలు, ఫర్నిచర్, కిరాణా వంటి శ్రేణులలో ప్రముఖ బ్రాండ్స్ నుండి 25,000కి పైగా కొత్త విడుదలలు పొందడానిక కస్టమర్లకు అవకాశం ఇచ్చింది. ఏజిఐఎఫ్ 2024 కూడా విక్రేతల విజయం కోసం కొత్త మైలురాళ్లను ఏర్పాటు చేసింది మరియు గత ఏడాదితో పోల్చినప్పుడు విక్రయాల్లో ఒక కోటిని అధిగమించిన విక్రేతలు 70%కి పైగా పెరిగారు. ఈ ఆన్ లైన్ మార్కెట్ ప్రదేశం తమ వేగవంతమైన డెలివరీ సామర్థ్యాలకు మద్దతుగా, అదే రోజు లేదా మరుసటి రోజు లోగా భారతదేశంవ్యాప్తంగా ఉన్న ప్రైమ్ సభ్యులకు 3 కోట్లకు పైగా ఉత్పత్తులను డెలివరీ చేసింది – ఇది గత ఏడాదితో పోల్చినప్పుడు 26% పెంపుదల.
“ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 భారతదేశపు గొప్ప షాపింగ్ వ్యవస్థగా మారింది, ఇంతకు ముందున్న రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టింది. రోజూవారీ అవసరాలు నుండి అత్యధిక విలువ గల కొనుగోళ్ల వరకు, దేశవ్యాప్తంగా వచ్చిన ఈ అనూహ్యమైన ప్రతిస్పందన అమేజాన్ ఇండియాతో కస్టమర్ల యొక్క లోతైన నమ్మకాన్ని సూచిస్తోంది. విస్తృతమైన ఎంపిక, సాటిలేని విలువ, వేగవంతమైన డెలివరీ మరియు నిరంతర ఆవిష్కరణ ద్వారా సాటిలేని షాపింగ్ అనుభవాన్ని కేటాయించడంలో ఏజిఐఎఫ్ మా అభిరుచికి ఉదాహరణగా నిలిచింది. కస్టమర్లు, విక్రేతలు మరియు భాగస్వాములు యొక్క మా పూర్తి వ్యవస్థ కోసం గొప్ప విలువను అందించే మరిన్ని అవకాశాలను సృష్టించడానికి మేము కట్టుబడ్డాము” అని సౌరభ్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్- కాటగిరీస్, అమేజాన్ ఇండియా అన్నారు.
ఇది ఎంతో ప్రత్యేకమైన సెల్లర్ బ్రేషన్
· గత ఏడాదితో పోల్చినప్పుడు ఏజిఐఎఫ్ ’24లో విక్రయాలలో రూ. 1 కోటిని అధిగమించిన విక్రేతలలో 70% పెంపుదల కలిగింది
· మహిళా ఔత్సాహికులు, నేత పనివారు, కళాకారులు సహా స్మాల్ మరియు మీడియం బిజినెసెస్ ఏజిఐఎఫ్ జరుగుతున్న సమయంలో ప్రతి నిముషానికి 1,000కి పైగా యూనిట్లు విక్రయించారు
· ఏజిఐఎఫ్ 2024 సమయంలో 42,000కి పైగా విక్రేతలు అత్యధికంగా ఒక్క రోజు సేల్స్ పొందారు
· ఫెస్టివల్ యొక్క అన్ని ఎడిషన్లలో అత్యధిక పిన్ కోడ్స్ సంఖ్య నుండి విక్రేతలు విక్రయాలను అందుకున్నారు. 4,500 మందికి పైగా విక్రేతలు గత ఏడాదితో పోల్చినప్పుడు తమ సేల్స్ లో 10x పెంపుదలను అనుభవించారు, 7,000కి పైగా విక్రేతలు 5x పెంపుదలను, మరియు 13,000కి పైగా విక్రేతలు 2x పెంపుదలను అనుభవించారు.
· భారతదేశంలో ఉత్తరాది ప్రాంతాలకు చెందిన విక్రేతలు ప్రధానమైన భాగంగా ఉన్నారు, పాల్గొంటున్న 70% విక్రేతలు టియర్ 2, దిగువ పట్టణాలకు చెందిన వారు. అమేజాన్ కూడా అత్యధిక సంఖ్య విక్రేతలు (టియర్ 2/3 పట్టణాలు నుండి) విక్రయాలు పొందింది (వెర్సెస్ ఏజిఐఎఫ్ ‘23)