Monday, January 27, 2025

మే 2 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్

- Advertisement -
- Advertisement -

వేసవి నేపథ్యంలో ఆన్‌లైన్ ఇ కామర్స్ సంస్థల డిస్కౌంట్లు, ఆఫర్ల జాతర మొదలైంది. ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేకంగా ‘గ్రేట్ సమ్మర్ సేల్’ ప్రకటించింది. మే 2 నుంచి ఇది మొదలు కానున్నట్లు తమ వెబ్‌సైట్, యాప్‌లో అమెజాన్ వెల్లడించింది. అయితే, ఈ సేల్ ఎప్పటి వరకు కొనసాగుతుందో సంస్థ ఇంకా తెలియజేయలేదు.
ప్రైమ్ మెంబర్లకు ముందుగా
అమెజాన్ తమ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కైబర్లకు మే 1 అర్ధరాతి 12 గంటల నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ సేల్‌లో ఐసిఐసిఐ బ్యాంక్, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని సంస్థ వెల్లడించింది. సేల్ సమయంలో వినియోగదారులు చేసే మొదటి ఆర్డర్‌ను ఉచితంగా డెలివరీ చేస్తామని, వెల్‌కమ్ రివార్డ్ పేరిట 20 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇస్తామని సంస్థ వెబ్‌సైట్‌లో తెలియజేసింది.

కొన్ని రకాల ప్రొడక్టుల శాంపిళ్లను కేవలం ఒక్క రూపాయికే అందజేయనున్నట్లు అమెజాన్ సూచించింది. ‘ట్రై బిఫోర్ యు బై@ 1 పేరిట ఈ ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది. ఆఫర్‌పై అందజేసే ఉత్పత్తులను ముందే బుక్ చేసుకునేందుకు ‘ప్రీ బుక్’ ఆఫర్‌ను కూడా అందజేయనున్నట్లు సంస్థ తెలిపింది. మరొక వైపు ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా తరచు నిర్వహించే ‘బిగ్ సేవింగ్స్ డేస్’ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ కొనసాగుతుందని తమ వెబ్‌సైట్, యాప్‌లలో ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News