Monday, January 20, 2025

 ఎపిలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన అమెజాన్ ఇండియా

- Advertisement -
- Advertisement -

అమరావతి: అమెజాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో తమ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ కింద, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ (LFE), క్వెస్ట్ అలయన్స్(QA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక ఎంఓయు జరిగినట్లు ప్రకటించింది. పాఠశాల విద్యా కమీషనర్ సురేష్ కుమార్ (IAS), సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు (IAS), SCERT డైరెక్టర్ ప్రతాప్ రెడ్డితో సహా కీలక ప్రభుత్వ అధికారులు సమక్షంలో ఈ ఎంఓయు పై సంతకాలు జరిగాయి. ఈ ఎంఓయు రాష్ట్రంలో ప్రారంభమైన కార్యక్రమాన్ని సూచిస్తుంది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 2024-25 విద్యా సంవత్సరం నాటికి 10,000 మంది విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది, 2026-27 నాటికి 100,000 మంది విద్యార్థులపై ప్రభావం చూపనుందని అంచనా వేయబడింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్, కంప్యూటేషనల్ థింకింగ్ & 21వ శతాబ్దపు నైపుణ్యాలపై శిక్షణా కార్యక్రమం ద్వారా తరగతి గదుల్లో కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను సమర్థవంతంగా అందించడానికి ఉపాధ్యాయులకు బోధన, సాంకేతిక, ఉపాధ్యాయ నాయకత్వ నైపుణ్యాలను సన్నద్ధం చేస్తుంది. ఈ కార్యక్రమం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్‌లోని ఉపాధ్యాయులకు వారి పాఠశాలల్లో కంప్యూటేషనల్ థింకింగ్ (CT) క్లబ్‌లను నిర్వహించడానికి శిక్షణ ఇస్తుంది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల కోసం కంప్యూటర్ సైన్స్ పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడాని, పైలట్ చేయడానికి స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT)తో చురుకుగా పని చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. “అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్‌తో భాగస్వామ్యం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలనే మా నిబద్ధతను నొక్కి చెబుతుంది. కంప్యూటేషనల్ థింకింగ్ మాడ్యూల్స్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ పెరుగుతున్న సాంకేతికతతో నడిచే ప్రపంచంలో సమస్య-పరిష్కార కర్తలు, ఆవిష్కర్తల తరాన్ని ప్రోత్సహిస్తుంది. కలిసికట్టుగా, మేము విద్య, భవిష్యత్తును రూపొందిస్తున్నాము. వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మా యువతను శక్తివంతం చేస్తున్నాము” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్‌ను విస్తరించడానికి మా భాగస్వామ్యం, మన విద్యా వ్యవస్థను విప్లవాత్మకీరించే దిశగా ఒక కీలకమైన ముందడుగును సూచిస్తుంది. కంప్యూటర్ సైన్స్ టీచింగ్ ఎక్సలెన్స్ కోర్సులను ఏకీకృతం చేయడం ద్వారా, మా విద్యార్థులను డిజిటల్ యుగానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న భవిష్యత్తు తరానికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు. “ఈ తరహా ప్రైవేట్-పబ్లిక్ భాగస్వామ్యాలు భారతదేశంలో భవిష్యత్ టెక్ టాలెంట్ పూల్‌ను నిర్మిస్తాయి” అని ఆయన జోడించారు.

అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్, ఇండియా లీడ్, అక్షయ్ కశ్యప్ మాట్లాడుతూ.. “అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ విద్యార్థులందరినీ, ముఖ్యంగా అవకాశాలకు దూరంగా ఉన్నవారిని, భవిష్యత్తు కెరీర్‌లకు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధం చేయడం మరియు మా దృష్టికి అనుగుణంగా ఉండే భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించింది. మేము కంప్యూటర్ సైన్స్‌ని అటువంటి కీలక నైపుణ్యంగా గుర్తించాము. గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది విద్యార్థులు.. 8,000 మంది అధ్యాపకులకు కంప్యూటర్ సైన్స్ విద్యను అందించాము. కంప్యూటర్ సైన్స్‌ను తమ తరగతి గదులకు తీసుకురావడానికి ఆసక్తి ఉన్న అధ్యాపకులు మార్పుకు కీలకమని మేము గమనించాము. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులు తమ తరగతి గదులకు కంప్యూటర్ సైన్స్ విద్యను తీసుకురావడానికి, విద్య భవిష్యత్తును రూపొందించడానికి ఈ సహకార ప్రయత్నానికి తోడ్పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్‌ను 2021లో భారతదేశంలో ప్రారంభించింది. గత రెండేళ్లలో భారతదేశంలోని 10000 కంటే ఎక్కువ పాఠశాలలకు కంప్యూటర్ సైన్స్ విద్యను అందించడానికి లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ, క్వెస్ట్ అలయన్స్‌తో సహా అనేక విద్య-కేంద్రీకృత లాభాపేక్షలేని సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బాల్యం నుండి కెరీర్ ప్రోగ్రామ్‌గా, ఏఎఫ్ఈ ఆఫర్‌లు ప్రాథమిక పాఠశాల విద్యతో ప్రారంభమవుతాయి. సెకండరీ విద్య ద్వారా కెరీర్‌లో కొనసాగుతాయి. ఈ కార్యక్రమం కింద, అమెజాన్ టెక్ పరిశ్రమలో కెరీర్ వృద్ధి చేసుకోవటానికి ఆసక్తి ఉన్న బాలికలకు స్కాలర్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లను కూడా అందించింది. తమ మిషన్‌ను పంచుకునే సంస్థలతో అమెజాన్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. స్వీయ వ్యక్తీకరణ, సామాజిక న్యాయం, స్థిరత్వం, మరిన్నింటితో సమ్మేళనం ద్వారా కంప్యూటర్ సైన్స్ యొక్క గొప్పతనాన్ని కనుగొనడానికి విద్యార్థులకు అవకాశాలను సృష్టిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News